- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంకీపాక్స్ పై ప్రధాని అత్యవసర సమావేశం
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్న మంకీపాక్స్ వ్యాధిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వచ్చిన హెచ్చరికల మేరకు ప్రధాని ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాలు మంకీపాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఈ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రధాని అన్నారు. ప్రతిరాష్ట్రంలో స్వయంగా ఈ వ్యాధికి సంబంధించిన ప్రత్యేక లాబ్స్, టెస్ట్ కిట్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, ప్రాథమికంగా ఈ వ్యాధిని గుర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా మంకీపాక్స్ ఇప్పటి వరకు భారత్ లో బయటపడ లేదు. భారత్ పొరుగు దేశాల్లో పలు కేసులు వెలుగులోకి రాగా.. భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరించడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో ప్రధాని అత్యవసర సమావేశమయ్యారు. ఒక్క ఆఫ్రికాలోనే 18 వేల మంకీపాక్స్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.