- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్
దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్‌కు పాలస్తీనాకు మధ్య ఉద్రిక్తత వాతావరణం టెన్షన్ పెట్టిస్తోంది. పలు దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల గురించి నెతన్యాహు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పరిస్థితులపై అప్‌డెట్ ఇస్తున్నారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట కాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు భారత ప్రజలు అండగా ఉన్నారని ప్రధాని ట్వీట్ చేశారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ తీవ్రంగా ఖండిస్తుందని తేల్చి చెప్పారు. కాగా పాలస్తీనాకు మద్దతుగా నిన్న సీడబ్ల్యూసీ రెజల్యూషన్ పాస్ చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీపై పొలిటికల్ ఫైట్ నడుస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మరో వైపు హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పోరాటం కొనసాగుతోంది. 1,500 మంది హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 3 లక్షల మంది రిజర్వ్ బలగాలను రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాలపై పట్టు సాధించినట్లు తెలుస్తోంది.