PM MODI: కులగణనపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
PM MODI: కులగణనపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన సోలాపూర్(Solapur) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ కొత్త కుట్రను అడ్డుకుంటామని ప్రకటించారు. ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్‌(Congress)కు ఆక్సిజన్‌ అని.. అందుకే కుల రాజకీయాలు చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. కులగణన(Caste Census) పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు.

బీసీలు(BC Caste) ఐక్యంగా ఉంటేనే సేఫ్‌గా ఉంటారని సూచించారు. కాగా, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని కాంగ్రెస్ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనినే అస్త్రంగా చేసుకొని ఎంవీఏ(MVA) కూటమి నేతలంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను మరింత పెంచుతామని చెబుతున్నారు. కులగణన అంటే సమాజాన్ని విభజించడం కాదని.. వివిధ వర్గాల వారు మరింత ప్రయోజనం పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఈ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కుట్రను బీసీలు గమనించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed