సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోడీ చివరి సందేశం.. కొత్త చట్టాలపై తీవ్ర ఉత్కంఠ?

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-19 08:23:19.0  )
సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోడీ చివరి సందేశం.. కొత్త చట్టాలపై తీవ్ర ఉత్కంఠ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత పార్లమెంటు భవనం ఇప్పుడు పాత పార్లమెంటు భవనంగా మారిపోయింది. సోమవారం నాడు ఈ పార్లమెంట్ భవనంలో ప్రారంభమైన ప్రత్యేక సేషన్ రోజంతా సాగిన సుదీర్ఘ చర్చల జరిపారు. ఇవాళ కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అంతా రెడీ అయింది. మధ్యాహ్నం 1.15 గంటలకు కొత్త పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశాలు మొదలవుతాయి. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి.

కొత్త చట్టాలు..?

ఈ పార్లమెంట్ సెషన్ ప్రత్యేకమైనదని, చారిత్రాత్మకమైందని నిన్న ప్రధాని మోడీ నిన్న చెప్పారు. దీంతో ఈ సమావేశాల్లో ఎలాంటి చట్టాలు, నిర్ణయాలు తీసుకుంటారని సర్వత్ర ఉత్కంఠంగా మారింది. సాధారణ చట్టాలనే రివిల్ చేస్తున్నారని, అసలైన కాంట్రవర్సీ కల్గించే చట్టాలను బీజేపీ నేతలు సీక్రెట్‌గా మెయింటెయిన్ చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఇండియా కూటమి నేతలు ప్రజా సమస్యలు తీర్చే విధంగా చట్టాలు, నిర్ణయాలు ఉంటే స్వాగతిస్తామని ఇది వరకే చెప్పారు.

సృహతప్పి పడిపోయిన బీజేపీ ఎంపీ

ఇదిలా ఉండగా పాత పార్లమెంటు భవనం దగ్గర గ్రూప్ ఫోటో దిగడానికి అంతా సిద్ధమవుతున్న సమయంలో చాలా సేపటి నుంచి వెయిట్ చేసిన బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన ఉక్కపోత, ఎండ తీవ్రత కారణంగానే ఇలా జరిగిందని, ప్రమాదమేమీ లేదని డాక్టర్లు పేర్కొన్నారు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీల చివరి సమావేశం

పాత పాతపార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల ఎంపీలతో చివరి మిటింగ్ పెట్టారు. మరోవైపు ప్రధాని మోడీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకే వేదికపై ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, ఖర్గే కూర్చున్నారు. మంత్రి పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ది హస్‌గా మాట్లాడుతున్నారు. అమృతకాలంలో లక్ష్యం పెద్దగా ఉందని, అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ పార్లమెంటులో నెహ్రూ స్వాతంత్ర్య దినోత్సవం లాంటి చారిత్రత్మక ప్రకటనలు వెల్లడించారని గుర్తు చేసుకున్నారు.

సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ ప్రసంగం

సెంట్రల్ హాల్లో ప్రధాని మాట్లాడుతూ.. మనం ఇవాళ కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్నాం. పార్లమెంట్ భవనం, సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ హాల్‌తో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. లోక్ సభ, రాజ్యసభ కలిసి 4 వేల చట్టాలు చేశాయన్నారు. 86 సార్లు సెంట్రల్ హాల్లో దేశ అధ్యక్షుల ప్రసంగం జరిగిందన్నారు. 41 దేశాల అధినేతలు ఇక్కడి నుంచే ప్రసంగించారు. ఇక్కడే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని గుర్తు చేసుకున్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా చట్టం చేశాం. 370 ఆర్టికల్ రద్దు చేశామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రసంగించారు.

Read More..

పాత పార్లమెంట్ భవనానికి పేరు పెట్టిన మోడీ.. వారందరికీ కీలక సూచన!

Advertisement

Next Story

Most Viewed