- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దేశ చరిత్రలో ‘వందే భారత్’ ఓ విప్లవం: ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే (Indian Rail ways) చరిత్రలో వందే భారత్ రైళ్లు విప్లవాత్మకమైనవని ప్రధాని మోడీ (Pm Modi) పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్ (Tata Nagar)లో ఆరు కొత్త వందేభారత్ రైళ్ల(Six New Vande Bharat Trains)ను వర్చువల్ విధానంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. దేశంలో రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం వల్లే అభివృద్ధి సులభతరం అవుతుందని చెప్పారు. గతం కంటే రైల్వే ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయిస్తు్న్నామని ప్రధాని మోడీ తెలిపారు.
కాగా మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ - పాట్నా, భాగల్పూర్ - దుమ్కా - హౌరా, బ్రహ్మపూర్ - టాటానగర్, గయా - హౌరా, డియోఘర్ - వారణాసి మరియు రూర్కెలా - హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.