- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్షాల అవిశ్వాస పరీక్ష మాకు శుభదాయకం.. లోక్ సభలో ప్రధాని మోడీ
X
దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ ఘటనకు సంబంధించి మూడు రోజులుగా లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోడీ విపక్షాలకు సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాల అవిశ్వాస పరీక్ష తమకు శుభదాయకం అని ప్రధాని మోడీ అన్నారు. 2018లోనూ తనపై అవిశ్వాసం పెట్టారని అన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి, ఎన్డేఏ కూటమికి చాలా సీట్లు వచ్చాయని అన్నారు.
తమపై విశ్వాసం ఉంచిన కోట్లాదిమంది ప్రజలకు ధన్యవాదాలు అని అన్నారు. ఈసారి కూడా అవిశ్వాస పరీక్ష ప్రవేశపెట్టమని దేవుడు ప్రతిపక్షాలకు చెప్పి ఉంటారని, ఈ అవిశ్వాస పరీక్ష వల్ల కూడా తమకు మంచి జరుగుతుందన్నారు. అవిశ్వాస పరీక్ష విపక్షాలకు ఫ్లోర్ టెస్ట్ అని, తమకు కాదని ప్రధాని స్పష్టం చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని అన్నారు.
Advertisement
Next Story