- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజ.. రెండుచోట్లా రాహుల్ ఆధిక్యం
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే అందరి దృష్టి వివిధ రాజకీయ పార్టీల అగ్ర నేతల స్థానాలపై పడింది. ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానంపై అందరి చూపు ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి సంచలన ఫలితం వస్తోంది. ఉదయం 9.51 గంటల సమయానికి వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి 5257 ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు 11,480 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతాను పోటీ చేస్తున్న వయనాడ్(కేరళ), రాయ్ బరేలీ(యూపీ) లోక్‌సభ స్థానాల్లోనూ లీడ్‌లో ఉన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందంజలో ఉన్నారు. కేరళలోని తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖర్ వెనుకంజలో ఉన్నారు.అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలోని బారామతిలో సుప్రియా సూలే వెనుకంజలో ఉన్నారు. యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ, కన్నౌజ్‌లో అఖిలేష్ యాదవ్, లక్నోలో రాజ్‌నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు. బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో అధిర్ రంజన్ చౌదరి ముందంజలో ఉన్నారు.