- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్.. మేనిఫెస్టోలో కీలక హామీ
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. ఆదివారం మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. అంతేగాకుండా.. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. తమ హయాంలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని.. మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకానికి కోటి మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఇంట్లో తయారైన కరెంట్‌ను ప్రజలు అమ్ముకోవడానికి కూడా వీలుంటుందన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని అన్నారు.