NDA కూటమికి కొత్త అర్థం చెప్పిన మోడీ

by Satheesh |
NDA కూటమికి కొత్త అర్థం చెప్పిన మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమికి ప్రధాని మోడీ కొత్త అర్థం చెప్పారు. శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ భవనంలో ఎన్డీఏ పక్ష ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో మోడీని బీజేపీ, ఎన్డీఏ పక్ష నేతగా కూటమిలోని మిగిలిన సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమికి ఆయన కొత్త నిర్వచనం చెప్పారు. ఎన్డీఏ అంటే, న్యూ ఇండియా.. డెవలప్ ఇండియా.. యాస్పిరేషనల్ ఇండియా అని కొత్త మీనింగ్ చెప్పారు. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడం అందరి కర్తవ్యమని పిలుపునిచ్చారు. దేశ ప్రజల స్వప్నాల సాకారానికి మా వద్ద రోడ్ మ్యాప్ ఉందని వెల్లడించారు.

అవినీతి రహిత పాలన అందించేందుకు ఎన్డీఏ కృషి చేసిందని పేర్కొన్నారు. సంస్కరణలతో స్థిర ప్రభుత్వవం అందించేందుకు ఎన్డీఏ కృషి చేసిందని తెలిపారు. ఇండియా అని పేరు మార్చుకున్న తర్వాత కూడా యూపీఏను ప్రజలు అంగీకరించలేదని ఎద్దేవా చేశారు. ఒకే పాయింట్ అజెండా కారణంతో ఇండియాను ప్రజలు మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చొబెట్టారని సెటైర్ వేశారు. వికసిత్ భారత్ సంకల్పంతో ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేసిందని స్పష్టం చేశారు. పదేళ్లలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడేశామని తెలిపారు. పేదల అవసరాలు తెలుసుకుని తీర్చడంలో సఫలమయ్యామని చెప్పారు.

Advertisement

Next Story