ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తిన అమిత్ షా

by S Gopi |
ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తిన అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో నెలకొన్న కులతత్వం, అవినీతి, బుజ్జగింపులు, దొరల రాజకీయాలను గత పదేళ్లలో ప్రధానీ మోడీ అంతమొందించారన్నారు. దాని స్థానంలో 'పనితీరు కలిగిన రాజకీయాలకు ' నాంది పలికారని అన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా, స్వాతంత్ర్యం తర్వాత కుల, అవినీతి, బుజ్జగింపు, దొరల రాజకీయాల కాలం సాగింది. గత 10 ఏళ్లలో మోడీ వాటిని అంతం చేసి, పనితీరు రాజకీయాలకు నాంది పలికారు. నక్సలిజం, తీవ్రవాదం, అతివాదం తమ చివరి శ్వాసను లెక్కిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోంది. ఒకటి, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది, మరొకటి రాజవంశాలను పోషించేదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. 'ఇండియా కూటమి ' అనేది రాజవంశ రాజకీయాల కూటమి. సోనియా గాంధీ తన కుమారుడు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తన కుమార్తె, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆమె మేనల్లుడిని, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌లు తమ కుమారులను ప్రమోట్ చేయడంతో బిజీగా ఉన్నారు. 100 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రానున్న లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకమని అమిత్ షా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed