- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అత్యున్నత పౌర పురస్కారం..
పరామరిబో (సురినామ్) : సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్’ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఈసందర్భంగా రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి అందుకున్న పురస్కారం గురించి ట్విట్టర్ వేదికగా మోడీ ప్రస్తావించారు. ‘‘సురినామ్ ప్రభుత్వం, ప్రజల తరఫున భారత రాష్ట్రపతికి లభించిన ఈ గౌరవం ఎంతో ప్రత్యేకమైనది. ఇది రెండు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రికి చిహ్నంగా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు.
అంతకుముందు రాష్ట్రపతి ముర్ము ట్విట్టర్ వేదికగా తాను సురినామ్ పురస్కారం అందుకున్న విషయాన్ని వెల్లడించారు. దీన్ని అందుకోవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. "ఈ గుర్తింపు నాకు మాత్రమే కాదు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 1.4 బిలియన్ల భారతదేశ ప్రజలకు కూడా చాలా ముఖ్యమైనది. ఇరు దేశాల మధ్య సోదర సంబంధాలను సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత-సురినామీ కమ్యూనిటీ వారికి ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నాను" అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.