- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణస్వీకారం
దిశ, నేషనల్ బ్యూరో: సిక్కిం సీఎంగా ‘సిక్కిం క్రాంతి కారి మోర్చా’ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణస్వీకారం చేశారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. గ్యాంగ్ టక్ లోని పల్జోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతోపాటు ఎస్‌కేఎం ఎమ్మెల్యేలు సోనమ్ లామా, అరుణ్‌కుమార్ ఉప్రేతి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 30 వేల మంది ప్రజలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం దృష్ట్యా సోమవారం గ్యాంగ్ టక్ లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే హాలిడే ఇచ్చారు.
వరుసగా రెండోసారి
సిక్కిం సీఎంగా వరుసగా రెండోసారి ప్రేమ్ సింగ్ తమాంగ్ బాధ్యతలు స్వీకరించారు. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను తమాంగ్ పార్టీ గెలుచుంది. ఈసారి ఎన్నికల్లో 25 ఏళ్ల పాటు సిక్కింను పాలించిన ‘సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్’ ఘోరఓటమి చవిచూసింది. కేవలం ఒక్కస్థానానికే పరిమితమైంది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎస్కేఎం 10 స్థానాలు దక్కించుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే 1994-1999 మధ్య మంత్రిగా పనిచేసిన తమాంగ్ రూ.10 లక్షల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారనే కేసు నమోదింది. ఈ కేసులో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించిన తమాంగ్ 2018లో విడుదలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్కేఎం 17 స్థానాలు గెలుచుకుని సీఎంగా తమాంగ్ ప్రమాణం చేశారు.