రైల్వే స్టేషన్‌లోని టీవీ స్క్రీన్‌లపై పోర్న్ వీడియో ప్లే (వీడియో)

by Mahesh |   ( Updated:2023-03-22 03:46:44.0  )
రైల్వే స్టేషన్‌లోని టీవీ స్క్రీన్‌లపై పోర్న్ వీడియో ప్లే (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ రైల్వే స్టేషన్ లో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులకు ఒక్కసారిగా షాకింగ్ దృష్యాలు టీవీ స్క్రీన్‌లపై ప్రత్యక్షమయ్యాయి. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దాదాపు రైల్వే స్టేషన్ లో ఉన్న అన్ని టీవీ స్క్రీన్‌లలో ఫోర్న్ వీడియో ప్లే అయింది. ఆ వీడియో దాదాపు మూడు నిమిషాల పాటు ప్లే అవ్వడం తో కుటుంభం తో వచ్చిన ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారు వెంటనే.. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు.. RPF స్క్రీన్‌లపై ప్రకటనలను ప్రదర్శించడానికి బాధ్యత వహించే ఏజెన్సీ అయిన దత్తా కమ్యూనికేషన్‌ను సంప్రదించి, పోర్న్ క్లిప్‌ను ముందు ప్రసారం చేయడాన్ని ఆపమని ఏజెన్సీ నిర్వాహకులను కోరింది.

కాగా ఈ ఘటన బీహార్ లోని రైల్వే స్టేషన్‌లోని 10 ప్లాట్ ఫామ్ పై జరగగా అక్కడే ఉన్న ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగనించిన రైల్వే అధికారులు, పోలీసులు రైల్వే స్టేషన్‌లోని టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనలను ప్రసారం చేయడానికి రైల్వే అధికారులు ఏజెన్సీతో ఒప్పందాన్ని రద్దు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Advertisement

Next Story