పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..

by Vinod kumar |
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
X

వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని గురువారం వాటికన్ అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి శ్వాససంబంధిత సమస్యలతో పోప్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆహారం తీసుకున్నారని తెలిపారు. ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సతో క్రమంలో ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని పోప్ ప్రతినిధి మాటియో బ్రూనీ ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన శ్వాస సమస్యలు కోవిడ్‌కు సంబంధించినవి కాదని, కొన్ని రోజులు చికిత్స తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

Advertisement

Next Story