Pooja khedkar: పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌కు బెయిల్

by Harish |
Pooja khedkar: పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌కు బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌కు శుక్రవారం బెయిల్ లభించింది. కొద్ది రోజుల క్రితం తుపాకీతో కొంతమంది రైతులను బెదిరిస్తున్న వీడియో బయటకు రాగా, అది సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో పుణె రూరల్ పోలీసులు మనోరమను అరెస్ట్ చేశారు. ధద్వాలి గ్రామంలో ఒక భూవివాదంలో తన సెక్యూరిటీ గార్డులతో కలిసి తుపాకీతో కొంతమంది రైతులను ఆమె బెదిరించారు. అయితే పూజా ఖేద్కర్ వివాదం జరుగుతున్న సమయంలో ఆమె తల్లి మనోరమ రైతులను బెదిరించిన వీడియో సంచలనంగా మారింది. దీంతో ఆమెను జులై 18న రాయ్‌గఢ్ జిల్లాలోని హిర్కానివాడి గ్రామంలో అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఖేద్కర్ దంపతులు, మరో ఐదుగురిపై IPCలోని అనేక సెక్షన్ల కింద - 307, 144, 147 (అల్లర్లు), 506 (నేరపూరిత బెదిరింపు), అలాగే ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. మనోరమ ఖేద్కర్ భర్త దిలీప్ ఖేద్కర్ రిటైర్డ్ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారి. ఈయనను కూడా అరెస్ట్ చేయగా, గత వారం ముందస్తు బెయిల్ మంజూరైంది. దిలీప్ ఖేడ్కర్‌పై కూడా గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో రెండుసార్లు సస్సెన్షన్‌కు గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed