జమ్ముకశ్మీర్ లో మంచు.. హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బంది తరలింపు

by Shamantha N |
జమ్ముకశ్మీర్ లో మంచు.. హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బంది తరలింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మంచు కురుస్తుంది. దీంతో లోక్ సభ ఎన్నికలకు అంతరాయం కలగకుండా పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించారు అధికారులు. మొత్తం 189 పోలింగ్ అధికారులు, 69 మంది పోలీస్ సిబ్బందితో తొలి బ్యాచ్ ను హెలికాప్టర్లలో తరలించినట్లు తెలిపారు అధికారులు. మార్వా, వార్వాన్‌లలో మంచు కురుస్తుంది. దాదాపు 10 అడుగుల వరు మంచు ఉంటుంది. దీంతో ఈ ప్రాంతాల్లో గురువారమే 34 మంది పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో మొత్తం 188 మంది భద్రతా సిబ్బంది మోహరించారు.

మార్వా, వార్వాన్, మచైల్ లోని 34 పోలింగ్ బూత్ లకు పోలింగ్ మెటీరియల్, లాజిస్టిక్స్ సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకొని పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఈవీఎంలు సహా ఇతర సామగ్రిని ముందస్తుగా పంపినట్లు తెలిపారు. ఈవిషయంపై రాజకీయల పార్టీలకు ముందస్తుగా సమాచారమందించామన్నారు. ఈవీఎంల సేఫ్టీ కోసం 5 స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.

పోలింగ్ సిబ్బందిని పంపడం దశలవారీగా కొనసాగుతుందని తెలిపారు అధికారులు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బందిని పంపుతున్నామని తెలిపారు అధికారులు. మార్వా, వార్వాన్ మరియు మచైల్ వంటి మంచు పాకెట్‌లను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా అధికారులను పంపుతున్నామన్నారు. ఇతర ప్రాంతాలకు సమర్థవంతమైన, ఫూల్‌ప్రూఫ్ రవాణా ప్రణాళికను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు.

ఇకపోతే, ఉధంపూర్- కతువా పార్లమెంటరీ నియోజకవర్గం కిష్త్వార్ కిందకే వస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 19న తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో సహా 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed