Assam: అస్సాం సరిహద్దులో ముగ్గురు బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు

by S Gopi |
Assam: అస్సాం సరిహద్దులో ముగ్గురు బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండో-సరిహద్దులో పోలీసులు ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వారిని వెనక్కి పంపినట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 'చొరబాట్లకు వ్యతిరేకంగా సరిహద్దులను రక్షించేందుకు కరీంగంజ్ పోలీసులు ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి, బుధవారం అర్దరత్రి 00:50 గంటల సమయంలో వారిని వెనక్కి పంపారు. వారు మహమ్మద్ జుబైర్ షేక్, జుయెల్ షేక్, రుమా ఖాతున్‌లుగా గుర్తించినట్టు ' పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం కూడా సీఎం హిమమత బిస్వా శర్మ హిందువులు ఎవరూ భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేయట్లేదని, వారంతా తమ సొంత దేశంలోనే పోరాడుతున్నారని చెప్పారు. గత నెలలో ఒక్క హిందువు కూడా అస్సాంలోకి ప్రవేసించిన దాఖలాలు లేవు. కానీ 35 మంది ముస్లింలను అరెస్ట్ చేశాము. తాజాగా మరికొంతమందిని వెనక్కి పంపామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story