- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎగిరిన త్రివర్ణ పతాకం.. జై భారత్ నినాదాలతో హోరెత్తిన నిరసనలు
దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ నిరసనలతో అట్టుడుకుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణం, విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుని భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని విధుల్లో తిరుగుతున్నారు. అదేవిధంగా జై భారత్.. జై భారత్ నినాదాలు చేస్తూ.. పాకు భద్రతా దళాలకు ఎదురు తిరుగుతున్నారు. అయితే, అక్కడ జరుగుతున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుని పీవోకే కోసం 23 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు అంటే భారత్ కరెన్సీలో రూ.718 కోట్ల ప్యాకేజీని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రకటించారు. అయినా పీవోకే వాసులు ఆందోళనలు విరమించడం లేదు. ఆ ప్రకటన వెలువడిన వెంటనే పాకిస్తాన్ రేంజర్లు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరుల ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురికి గాయలయ్యాయి.