- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఓకే ముమ్మాటికీ భారత్‌దే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ముమ్మాటికీ భారత్‌కే చెందుతుందని, దానిని వెనక్కి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘ఫరూక్ అబ్దుల్లా, మణిశంకర్ అయ్యర్‌లు పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున గౌరవం ఇవ్వండి అని చెబుతున్నారు. కానీ అటువంటి వాటికి బీజేపీ భయపడదు. పీఓకే ముమ్మాటికీ భారత్ దే. ఎప్పటికైనా భారత్‌లో కలవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా ఆర్టికల్ 370తో కశ్మీర్ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.‘ఇప్పటికే దేశంలో నాలుగు దశల పోలింగ్ పూర్తైంది. ఈ నాలుగు దశల్లో ఇండియా కూటమి తుడిచిపెట్టుకు పోయింది. మోడీ 400 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు’ అని చెప్పారు. కాగా, అలహాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన నీరజ్ త్రిపాఠి, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, యూపీ శాసనసభ స్పీకర్ కేశరీనాథ్ త్రిపాఠి, రాజ్యసభ ఎంపీ రియోటి రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రామ్ సింగ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ మే 25న ఆరో దశలో భాగంగా పోలింగ్ జరగనుంది.