PM Modi US visit schedule : ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు!

by Geesa Chandu |   ( Updated:2024-09-17 16:04:06.0  )
PM Modi US visit schedule : ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అమెరికా(America) పర్యటన(Tour) ఖరారైంది. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకూ అమెరికాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు ప్రధాని. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తో కలిసి.. డెలావేర్(Delaware) లోని విల్మింగ్టన్(Wilmington) లో జరగబోయే క్వాడ్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ సదస్సు లో ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమ్మిట్ భారత్ లో జరగాల్సి ఉంది. అయితే అమెరికా విజ్ఞప్తి మేరకు ఈ సమ్మిట్ ను 2025 లో భారత్ లో నిర్వహించనున్నారు.

ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. సెప్టెంబర్ 22 వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అయితే ఈ సదస్సుకు దాదాపు 24 వేల మందికి పైగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 23 వ తేదీన.. న్యూయార్క్ లో జరిగే యూఎన్ సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్(UN Summit for The Future) కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు.

Advertisement

Next Story