ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ సహా పలువురు నేతలు

by S Gopi |
ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ సహా పలువురు నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం 66వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 'రాష్ట్రపతికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మనదేశం పట్ల ద్రౌపది ముర్ము అందిస్తున్న సేవ, అంకితభావం అందరికీ స్పూర్తినిచ్చేవిగా ఉన్నాయి. పేద, అట్టడుగు వర్గాలకు సేవ చేయడంపై ఆమె చూపే చొరవ ఎంతో మార్గదర్శ్కంగా ఉంది. అలసిపోకుండా దార్శనికతతో భారత్‌కు నాయకత్వం వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు' మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన, దేశాభివృద్ధికి రాష్ట్రపతి అంకితభావం స్పూర్తిదాయకమని అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా పలువురు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed