Swachh Bharat : ఏటా 70వేల మంది పసికందుల ప్రాణాలను నిలుపుతున్న ‘స్వచ్ఛభారత్‌’.. సంచలన నివేదిక

by Hajipasha |
Swachh Bharat : ఏటా 70వేల మంది పసికందుల ప్రాణాలను నిలుపుతున్న ‘స్వచ్ఛభారత్‌’.. సంచలన నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం పుణ్యమా అని మనదేశంలో ఎంతోమంది ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించుకోగలిగారు. దీనివల్ల 2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో దేశంలో ఐదేళ్లలోపు శిశువుల మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సగటున ఏటా 70వేల మంది శిశువుల అకాల మరణాలను స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతంగా ఆపిందని నివేదికలో ప్రస్తావించారు. మన దేశంలోని 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 600కుపైగా జిల్లాల్లో గత 20 ఏళ్లలో నిర్వహించిన సర్వేల సమాచారాన్ని సేకరించి అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు విశ్లేషించారు.

స్వచ్ఛభారత్ మిషన్ వల్ల శిశువుల మరణాలు గణనీయంగా తగ్గాయని వారు గుర్తించారు. ఏదైనా జిల్లాలో స్వచ్ఛ భారత్‌లో భాగంగా టాయిలెట్ల లభ్యత పెరిగితే.. అక్కడ శిశువుల మరణాలు గణనీయంగా తగ్గిపోవడాన్ని గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు తెలిపారు. ఈ నివేదికపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. స్వచ్ఛభారత్ మిషన్ వల్ల ప్రజల జీవితాలు మారుతున్నందుకు, ఎంతోమంది శిశువుల ప్రాణాలు నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed