- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండిపోర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన పీఎం మోడీ
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని బండిపోర్ టైగర్ రిజర్వ్ ను ప్రధాని మోడీ ఆదివారం ఉదయం సందర్శించారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోడీ ఈ పర్యటన చేశారు. ఈ సందర్భంగా 20 కిలో మీటర్ల పాటు ప్రధాని మోడీ సఫారి వాహనంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలు, జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి కేంద్రాలు, ఎలెఫెంట్ క్యాంప్స్ తదితర ప్రదేశాలను అధికారులు పీఎంకు చూపెట్టనున్నారు. అనంతరం తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ ను సందర్శించనున్నారు.
ఇక్కడే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలెఫెంట్ విస్ఫరర్స్’ మూవీని షూట్ చేశారు. ఆ మూవీలోని రఘు అనే ఎలెఫెంట్ తో పాటు దానిని పెంచిన బొమ్మన్, బెల్లీలను ప్రధాని మోడీ కలుసుకోనున్నారు. అనంతరం ఆయన తిరిగి కర్ణాటక రానున్నారు. మైసూర్ లోని కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. పులుల సంరక్షణకు అమృతకాలంలో ప్రభుత్వం చేపట్టబోయే చర్యలకు సంబంధించిన విజన్ తో పాటు 2022కు సంబంధించిన పులుల సెన్సన్ ను పీఎం విడుదల చేయనున్నారు.