అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వీడియో సందేశం

by Mahesh |   ( Updated:2023-06-21 12:08:19.0  )
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వీడియో సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఐక్యరాజ్య సమితి నాయకత్వం, అంతర్జాతీయ సమాజ సభ్యులతో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ క్రమంలో యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. అందులో అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారిందని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు యోగా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంతో యావత్ ప్రపంచం 'వసుధైక కుటుంబం'గా మారిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కాగా ఈ రోజు ప్రధాని మోడీ UNలో దాదాపు 180 దేశాలకు చెందిన ప్రజలతో యోగా వేడుకల్లో పాల్గొననున్నారు.

Also Read..

ప్రధాని మోడీతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ బేటీ

Advertisement

Next Story