మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక ఘట్టం : ప్రధాని మోడీ

by Vinod kumar |
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక ఘట్టం : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు బుధవారం లోక్ సభలో లభించిన ఏకగ్రీవ ఆమోదం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని, అది చారిత్రాత్మక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్‌లో నారీశక్తిని పెంచే ఈ పవిత్ర కార్యం కోసం సహకరించిన లోక్ సభ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఆయన లోక్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత లోక్ సభలోని ప్రతి పార్టీ సభ్యుడికి, సభ బయట ఉన్న అన్ని పార్టీల నేతలకు దక్కుతుందని పేర్కొన్నారు.

‘‘ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చే క్రమంలో సర్కారుకు మద్దతుగా నిలిచి, అర్థవంతమైన చర్చకు ఆస్కారం కల్పించిన వారందరికీ లోక్ సభా పక్ష నేత హోదాలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తదుపరిగా ఈ బిల్లుకు రాజ్యసభ కూడా అందించబోయే మద్దతుతో మన దేశం కొత్త శిఖరాలను అధిరోహించడానికి మార్గం సుగమం అవుతుంది’’ అని మోడీ చెప్పారు.

Advertisement

Next Story