- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాలంటే బీజేపీ గెలవాలి: ప్రధాని మోడీ
జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీని గెలిపిస్తే.. పేదలు, మధ్యతరగతి పౌరులకు ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ ధరలను పునర్ సమీక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. రాజస్థాన్‌తో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోలును తక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు. రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. “రాజస్థాన్ పొరుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.97. కానీ రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలును అంతకంటే ఎక్కువ రేటుకు అమ్ముతోంది’’ అని ఆయన తెలిపారు.
దీనికి అడ్డుకట్ట పడాలన్నా, పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావాలన్నా.. రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకోవడం అత్యవసరమన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ‘‘మహిళలు చేసిన ఫిర్యాదులన్నీ ఫేక్ అని సీఎం గెహ్లాట్ అంటున్నారు. కేసులు విచారణ దశలో ఉన్నాయని చెప్పాలే కానీ.. వాటిని ఫేక్ అని ఎలా చెబుతారు ? సీఎం గెహ్లాట్ మాటలు మహిళలను అవమానించేలా ఉన్నాయి’’ అని ప్రధాని మోడీ కామెంట్ చేశారు.
‘‘బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో పీఎం కిసాన్ సాయం రూ.6వేలే అందుతోంది. ఒకవేళ రాష్ట్రంలోనూ బీజేపీని గెలిపించుకుంటే అదనంగా మరో రూ.6వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అందుతాయి’’ అని ఆయన వివరించారు.