PM Modi: ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు సత్తా చాటాలి : మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

by Shiva |
PM Modi: ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు సత్తా చాటాలి : మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచ క్రీడా సంబురం ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సారి ప్రపంచ క్రీడలకుపారిస్ ఆతిథ్యమిస్తున్నది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రీడాకారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్‌లో దేశం తరఫున పాల్గొన్న క్రీడాకారులను శుభాకాంక్షలు తెలియజేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు సత్తా చాటాలని ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయిలో త్రివర్ణ పతాకం ప్రదర్శించే సువర్ణావకాశం వారికి వచ్చిందని అన్నారు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున 117 మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 16 క్రీడా అంశాల్లో బరిలో దిగబోతున్నారు. అందులో ఒక్క అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 29 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత షూటింగ్‌లో 21 మంది పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 121 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సారి మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించ లేదు.

Advertisement

Next Story