Mann Ki Baat: పదేళ్లు పూర్తి చేసుకున్న మన్‌కీ బాత్‌ కార్యక్రమం

by Shamantha N |
Mann Ki Baat: పదేళ్లు పూర్తి చేసుకున్న మన్‌కీ బాత్‌ కార్యక్రమం
X

దిశ, నేషనల్ బ్యూరో: మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం 114వ ఎసిపోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు, స్ఫూర్తిదాయకమైన స్టోరీలను ప్రసారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. సాధారణ కంటెంట్ ని ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని.. ఈ కార్యక్రమంతో అది అపోహా అని తేలిందన్నారు. స్ఫూర్తిమంతమైన కథలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. నీటి నిర్వహణ గురించి ప్రస్తావించారు. నీరు, జలవనరుల సంరక్షణ కీలకమని చెప్పారు. ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.

20 వేల భాషలకు భారత్ పుట్టిల్లు

20 వేల భాషలకు భారత్‌ పుట్టినిల్లు అని మోడీ పేర్కొన్నారు. భాషల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ‘ ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. గుజరాత్‌లో 15 కోట్లకు పైగా, యూపీలో 26 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. ‘మేకిన్‌ ఇండియా’(Make in India) కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిందన్న్నారు. ప్రతి రంగంలోనూ ఎగుమతలు పెరిగాయని గుర్తుచేశారు. విదేశీ సంస్థాగత మదుపరులను (FDI) ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందన్నారు. ఈ కార్యక్రమం స్థానిక తయారీదారులకు సాయపడిందన్నారు. పండుగ సీజన్ లో మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు.

Advertisement

Next Story