రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..

by Vinod kumar |
రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..
X

రాజ్‌కోట్ (గుజరాత్‌) : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ సిటీ శివార్లలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం. రూ.1,405 కోట్లతో దీని నిర్మాణం జరిగింది. రాజ్‌కోట్‌ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాసర్ గ్రామంలో 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్ పోర్ట్‌ను నిర్మించారు.

ఇందులో 14 విమానాలను ఏ సమయంలోనైనా పార్క్ చేసే వెసులుబాటు ఉంది. 2017 అక్టోబర్‌లో దీని నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో నడుస్తూ.. అధికారులతో మాట్లాడి సాంకేతిక అంశాల గురించి తెలుసుకున్నారు.

Advertisement

Next Story