దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో విశేషాలివీ..

by Hajipasha |   ( Updated:2024-03-06 13:05:05.0  )
దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో విశేషాలివీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో స్వయంగా పచ్చజెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ మెట్రోను ప్రారంభించిన తర్వాత కొంతమంది విద్యార్థులతో కలిసి కూర్చొని ప్రధాని మోడీ ప్రయాణించారు. కాసేపు ఆ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. తాను ప్రయాణిస్తున్న మెట్రో లోపలి నుంచి.. మరో మెట్రోలోని ప్రయాణికులకు ఆయన అభివాదం చేశారు. ఈసందర్భంగా ప్రధాని వెంట పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి, పలువురు మెట్రో అధికారులు ఉన్నారు. మార్చి 7 నుంచి ఈ ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా రూ.15,400 కోట్లు విలువైన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

అండర్ వాటర్ మెట్రో విశేషాలు

* కోల్‌కతా మెట్రో ఈస్ట్ - వెస్ట్ కారిడార్‌ ప్రాజెక్టులో భాగంగా 4.8 కిలోమీటర్ల పరిధిలో ఈ అండర్ వాటర్ మెట్రో రైల్వే లైన్‌ను నిర్మించారు.

* హుగ్లీ నది కింద 30 మీటర్ల లోతులో ఈ మెట్రో కారిడార్‌ను నిర్మించారు.

* హౌరా మెట్రో స్టేషన్‌ దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌‌ను కలిగి ఉంది.

* ఈ రైల్వే లైన్ 16.6 కి.మీ హుగ్లీ నది కింద, 10.8 కిలోమీటర్లు భూమి కింద ఉంది.

* అండర్ వాటర్ మెట్రో ట్రైన్ సర్వీసు బెంగాల్‌లోని హౌరా నగరం నుంచి సాల్ట్ లేక్‌ నగరం మధ్య నడుస్తుంది.

* ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.4.965 కోట్లు ఖర్చు చేసింది.

* ఈ మెట్రో ప్రాజెక్టులో భాగంగా హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్‌ ప్రాంతాన్ని కలుపుతూ 520 మీటర్ల పొడవు కలిగిన టన్నెల్‌ను కట్టారు. కేవలం 45 సెకన్లలోనే ఈ టన్నెల్‌‌లో నుంచి మెట్రో రైలు దూసుకెళ్తుంది.

Advertisement

Next Story