బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం.. 2024 ఎన్నికలే టార్గెట్..?

by Satheesh |
బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం.. 2024 ఎన్నికలే టార్గెట్..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉండేలా తమదైన రూట్ మ్యాప్‌తో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నాహాకానికి సంబంధించిన విషయాలను ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం ఈ భేటీ జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని ఏ రకమైన ఆదేశాలు ఇచ్చారనేది హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story