Modi Poland Visit: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

by Shamantha N |
Modi Poland Visit: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాలు పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో వార్సా పయనమయ్యారు. అయితే, ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ‘పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయి. సెంట్ర‌ల్ యూరోప్‌లో పోలాండ్ కీల‌క‌మైన ఆర్థిక భాగ‌స్వామి. ప్ర‌జాస్వామ్యం, బహుళ‌త్వానికి రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నాయి. ఇది ఇరు దేశాల బంధాన్ని బ‌లోపేతం చేస్తుంది’ అని మోడీ రాసుకొచ్చారు. పోలాండ్ అధ్య‌క్షుడు ఆండ్రేజ్ దుడా, ప్ర‌ధాని డోనాల్డ్ ట‌స్క్‌ తో మోడీ భేటీ కానున్నారు. అక్కడే ఉన్న భారత కమ్యూనిటీ ప్రజలను కూడా ఆయన కలవనున్నారు. ఇకపోతే, గత 45 ఏళ్లలో పోలాండ్ లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ కు..

పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్ల‌నున్న‌ట్లు ప్రధాని మోడీ తెలిపారు. దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేర‌కు ఉక్రెయిన్ వెళ్తున్న‌ట్లు చెప్పారు. భారత ప్ర‌ధాని ఉక్రెయిన్‌కు వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఉక్రెయిన్‌లో త్వ‌ర‌గా శాంతి, స్థిర‌త్వం రావాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. పోలాండ్ నుంచి ఆగస్టు 23న విలాసవంతమైన 'ట్రైన్ ఫోర్స్ వన్'లో మోడీ ఉక్రెయిన్‌కు వెళతారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు అగ్రనాయకులు ఇందులోనే ప్రయాణించారు. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ఉక్రెయిన్ లో పర్యటించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed