- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్ ఫేక్ క్రైమ్ కేసుల వ్యాఖ్యలు.. సీఎం గెహ్లాట్‌పై ప్రధాని మోదీ విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించి.. పబ్లిక్ మీటింగ్ లో పాల్గోన్నారు. రాజస్థాన్‌లోని పాలిలో అసెంబ్లీ ఎన్నికల బహిరంగ ర్యాలీ నిర్వహించిన ప్రధాని.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మహిళల పై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ కాంగ్రెస్ నంబర్ వన్‌గా నిలిపిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదులు నకిలీవని సీఎం అంటున్నారు.
మన దేశంలో ఒక మహిళ ఫేక్ కేసు పెట్టడం ఎప్పుడైనా జరుగుతుందా? దాఖలైన కేసులు ఫేక్ అని కాకుండా విచారణ జరుగుతోందని సీఎం చెప్పాలి. ఇది మహిళలను అవమానించడం కాదా?” అని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ రాష్ట్ర సీఎం గెహ్లాట్ పై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. కాగా రాజస్థాన్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్న సమయంలో.. సీఎం గెహ్లాట్ స్పందిస్తూ అవన్ని ఫెక్ కేసులని కొట్టి పడేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పలు మహిళా సంఘాలు నిరసన కూడా వ్యక్తం చేశారు.