- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవిశ్వాసం తీర్మానం రగడ.. పార్లమెంట్ లో అడుగుపెట్టిన ప్రధాని
దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ ఘటనపై చర్చించడానికి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పార్లమెంట్ ఉభయ సభల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే విపక్ష సభ్యులు ప్రధాని మోడీ పార్లమెంట్ కు హాజరై మణిపూర్ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ లోక్ సభకు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నేత అధిర్ రంజన్ అవిశ్వాస తీర్మానం ఉపన్యాసం సమయంలో ప్రధాని మోడీ సభకు హాజరయ్యారు. కాగా మోడీ సభకు రావడంతో ఆయన ఏం మాట్లాడుతారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కాగా ఎంపీ పదవిని తిరిగి పొందాక పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ మణిపూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రధాని మోడీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.