- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ రోడ్‌షో
దిశ, నేషనల్ బ్యూరో : ‘వైబ్రంట్ గుజరాత్’ గ్లోబల్ సదస్సులో పాల్గొనేందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్ షో జరిగింది. గాంధీనగర్- అహ్మదాబాద్‌లను అనుసంధానం చేసే ఇందిరా వంతెన వద్ద రోడ్ షో ముగిసింది. ఈ రోడ్ షోలో మోడీ, షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. ప్రధాని మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
మోడీ ట్వీట్ ఇదీ..
అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘‘వైబ్రంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనేందుకు నా సోదరుడు (యూఏఈ అధ్యక్షుడు) మహ్మద్ బిన్ జాయెద్ రావడం చాలా ప్రత్యేకం. ఈ సదస్సుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ వేదిక గుజరాత్‌కు ఎలా తోడ్పడిందో.. అనేక మందికి ఎలా అవకాశాలను సృష్టించిందో తలుచుకొని నేను ఎంతో సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సును ప్రధాని మోడీ బుధవారం ఉదయం 9.45 గంటలకు ప్రారంభిస్తారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికగా నిలువనుంది. 34 దేశాలకు చెందిన కీలక నేతలు, 16 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు దేశాల నేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈనెల 12వ తేదీన సదస్సు ముగుస్తుంది.
#WATCH | UAE President Mohamed bin Zayed Al Nahyan arrives in Gujarat's Ahmedabad to take part in the Vibrant Gujarat Global Summit
— ANI (@ANI) January 9, 2024
PM Modi and UAE president will hold a roadshow in the city today pic.twitter.com/TmhkmevFja