Pinarayi Vijayan: సినీ పరిశ్రమను సంస్కరించడమే లక్ష్యం.. కేరళ సీఎం పినరయి విజయన్

by vinod kumar |
Pinarayi Vijayan: సినీ పరిశ్రమను సంస్కరించడమే లక్ష్యం.. కేరళ సీఎం పినరయి విజయన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సినిమా పరిశ్రమను సంస్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తాయని, మహిళలు భయపడకుండా పరిశ్రమలో పనిచేయడం ఎంతో కీలకమని నొక్కి చెప్పారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు శ్రీకుమారన్ థంపి అవార్డును శనివారం ప్రదానం చేశారు. ఈ సందర్భగా విజయన్ మాట్లాడుతూ.. నైతిక విలువలను ప్రోత్సహించడం ద్వారా సినిమా పట్ల ప్రజల ప్రేమను చిత్ర పరిశ్రమ తిరిగి పొందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ చర్యలు సినిమా పరిశ్రమను సంస్కరించే లక్ష్యంతో ఉన్నాయని, అందుకే హేమ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మహిళలు నిర్భయంగా చిత్ర పరిశ్రమలో పనిచేయగలరని తెలిపారు. సినిమా రంగంలో తమ కళాత్మక ప్రతిభను నిర్భయంగా ప్రదర్శించే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని, ఎలాంటి షరతులు విధించకూడదని అభిప్రాయపడ్డారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. హేమ కమిటీ నివేదికను స్వాగతించారు. దోషులుగా తేలిన వారికి శిక్ష పడుతుందని, విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story