విదేశీ స్త్రీకి పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడు.. బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

by Vinod kumar |
విదేశీ స్త్రీకి పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడు.. బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి దేశ భక్తుడు ఎప్పుడూ కాలేడని అన్నారు. ఈ విషయాన్ని 2 వేల ఏళ్ల క్రితం చాణక్యుడే చెప్పారని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరుపై వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన గాంధీ కుటుంబంపై దాడికి చేశారు. రాహుల్ గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారని అన్నారు.

మన ప్రజాస్వామ్యం, కోర్టులు, జర్నలిస్టులు అన్నీ తప్పని చెబుతుంటే మీరు భారతదేశాన్ని విశ్వసించరనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. వయనాడ్ ఎంపీ అలవాటు ప్రకారం నేరస్తుడని విమర్శించారు. తనను తాను యువరాజుగా భావిస్తూ.. ప్రధాని మోడీ ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్నారని దుయ్యబట్టారు. అంతకుముందు బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story