- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2014లోనే కాలం చెల్లిన ఫోన్లను ప్రజలు వదిలేశారు.. కాంగ్రెస్‌పై మోడీ సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఔట్ డేటెడ్ ఫోన్స్‌గా అభివర్ణించారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించిన ప్రధాని.. మొబైల్ లాంగ్వేజ్‌లోనే కాంగ్రెస్, ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. దేశ ప్రజలు 2014 లోనే కాలం చెల్లిన ఫోన్ (కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం)ను వదిలించుకున్నారన్నారు. ఔట్ డేటెడ్ ఫోన్లలో స్తంభించిన స్క్రీన్లపై ఎన్ని సార్లు స్వైప్ చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా ఫలితం ఉండదన్నారు.
వాటిని రీస్టార్ట్ చేసినా, బ్యాటరికీ ఛార్జింగ్ పెట్టినా చివరకు బ్యాటరీనే మార్చినా ఆ ఫోన్లు పనిచేయవు. 2014లో ప్రజలు అలాంటి పాత ఫోన్‌లను వదిలిపెట్టి దేశానికి సేవ చేయడం కోసమే మాకు అవకాశం కల్పించారని అన్నారు. ఈ సందర్భంగా సాంకేతిర రంగంలో భారత్ సాధించిన విజయాలను మోడీ గుర్తు చేశారు. మన దేశం 6జీ దిశగా అడుగులు వేస్తోంది. బ్రాడ్ బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్ లో ఉంటే ఇప్పుడు 43వ ర్యాంక్ కు చేరిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ఉపయోగించే స్థాయితే దేశం చేరుకుందని చెప్పారు.