అరుంధతీ రాయ్‌కు ‘పెన్ పింటర్ ప్రైజ్‌’ పురస్కారం.. ప్రకటించిన అవార్డ్ కమిటీ

by Vinod |
అరుంధతీ రాయ్‌కు ‘పెన్ పింటర్ ప్రైజ్‌’ పురస్కారం.. ప్రకటించిన అవార్డ్ కమిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌కు ప్రతిష్టాత్మకమైన ‘పెన్ పింటర్ ప్రైజ్-2024’ అవార్డు లభించింది. ఈ మేరకు అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. అక్టోబర్ 10న బ్రిటిష్ లైబ్రరీ నిర్వహించే కార్యక్రమంలో రాయ్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించనున్నారు. 14 ఏళ్ల క్రితం రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఘ‌ట‌న‌లో ఇటీవల అరుంధ‌తీ రాయ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ అవార్డు వరించడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లీష్ పెన్ చైర్మన్ రూత్ బోర్త్‌విక్ మాట్లాడుతూ..పెన్ ప్రింటర్ ప్రైజ్ గెలుచుకున్న అరుంధతీ రాయ్‌కు అభినందనలు తెలిపారు. ఆమె అంతర్జాతీయ ఆలోచనా పరురాలని తెలిపారు. అరుందతీ గొంతు నిశబ్దంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. స్వేచ్చ, న్యాయం కోసం నిరంతరం పోరాడుతుందని కొనియాడారు.

ఈ అవార్డుకు ఎంపికైనందకు అరుంధతీ రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అరుంధతి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’కు గాను మాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. కాగా, నోబెల్ గ్రహీత, ర‌చ‌యిత హ‌రాల్డ్ పింట‌ర్ జ్ఞాప‌కార్థం పెన్ పింట‌ర్ అవార్డును 2009 నుంచి ప్రదానం చేస్తున్నారు. బ్రిట‌న్‌, ఐర్లాండ్ లేదా కామ‌న్‌వెల్త్ దేశాల్లో ఉంటూ సాహిత్యంలో ప్రతిభ చాటిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. గతంలో సల్మాన్ రష్దీ, మార్గరెట్ అట్‌వుడ్, టామ్ స్టాపర్డ్ తదితరులు ఈ బహుమతిని అందుకున్నారు.

Next Story

Most Viewed