- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
DMK: త్రిభాషా విధానంపై పవన్ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డీఎంకే

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో భాషా యుద్ధం తీవ్రమవుతోంది. త్రిభాషా విధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. అయితే, దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నప్పుడు.. తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ ఎందుకు చేస్తున్నారంటూ డీఎంకే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రశ్నించారు. అయితే, పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు డీఎంకే ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా హిందీ లేదా మరే ఇతర భాషలు నేర్చుకోవడానికి తమ సర్కారు అడ్డుపడట్లేదన్నారు. ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు సుదీర్ఘ కాలంగా హిందీకి బలవంతపు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీస్కూల్స్ వంటి విధానాలతో రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతోందన్నారు.
అప్పటికి ఇంకా పవన్ పుట్టలేదు
డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎళన్గోవన్ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘తమిళనాడు భాషా విధానం చాలా కాలంగా స్థిరంగా ఉంది. 1938 నుంచే తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని 1968లో రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని కూడా ఆమోదించుకున్నాం. విద్యా నిపుణుల సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ బిల్లు పాస్ అయినప్పటికీ పవన్ కల్యాణ్ పుట్టి ఉండరు. తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేదు’ అని విమర్శించారు. పిఠాపురంలో శుక్రవారం నిర్వహించిన సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పలు విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తమిళనాట హిందీని తమపై రుద్దుతున్నారని చేస్తున్నారని గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంత వరకు కరెక్ట్. మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది’ అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. దీనిపైనే డీఎంకే స్పందించింది.
Also Read...
పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత
హిందీ దుమారం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు రియాక్షన్ ఇదే..!