ఓటింగ్ పర్సెంటేజ్.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకెంత ఓటింగ్..?

by karthikeya |   ( Updated:2024-10-08 08:09:19.0  )
ఓటింగ్ పర్సెంటేజ్.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకెంత ఓటింగ్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పార్టీలకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ చాలా విచిత్రంగా ఉంది. పోలింగ్‌లో అధిక ఓటింగ్ శాతం పొందిన పార్టీ సీట్ల గెలుపులో వెనుక పడిపోయింది. తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న పార్టీ దూసుకుపోతోంది. ఉదాహరణకి.. ఇప్పటివరకు లభించిన ఓట్లలో హర్యానాలో 39.9 శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. అదే 39.6 శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది. మరో వైపు జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటివరకు లభించిన ఓట్లలో అత్యధికంగా 26 శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న బీజేపీ దారుణంగా ఓటమి అంచున నిలవగా.. 23.3 శాతం ఓట్ షేర్‌తో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం వైపు దూసుకుపోతోంది. అయితే ఎన్సీ పార్టీకి కాంగ్రెస్ 11.8 శాతం ఓటింగ్ కూడా తోడవడంతో ఆ పార్టీకి విజయం సులభతరం అవుతోంది. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హర్యానా, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంటేజ్‌ని గమనిస్తే..

జమ్మూ కశ్మీర్‌లో పార్టీల వారీగా ఓటింగ్ పర్సెంటేజ్:

  • ఎన్సీ 23.3 శాతం
  • కాంగ్రెస్ 11.8 శాతం
  • బీజేపీ 26 శాతం
  • పీడీపీ 8.6 శాతం

హర్యానాలో పార్టీల వారీగా ఓటింగ్ పర్సెంటేజ్:

  • బీజేపీ 39.6 శాతం
  • కాంగ్రెస్ 39.9 శాతం
  • ఐఎన్‌ఎల్‌డీ 4.3 శాతం
  • బీఎస్పీ 1.6 శాతం
  • జేజేపీ 0.9 శాతం
  • ఇతరులు 11 శాతం

Advertisement

Next Story

Most Viewed