10న పార్లమెంటులో తప్పక ఉండండి.. ఎంపీలందరికీ బీజేపీ విప్

by Hajipasha |
10న పార్లమెంటులో తప్పక ఉండండి.. ఎంపీలందరికీ బీజేపీ విప్
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ తమ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ శుక్రవారం మూడులైైన్ల విప్ జారీ చేసింది. శనివారం రోజు పార్లమెంటు సమావేశాలకు తప్పకుండా హాజరుకాావాలని అందరికీ నిర్దేశించింది. పార్లమెంటు ఉభయసభల్లో కీలకమైన బిల్లులపై చర్చ, ఆమోదానికి సంబంధించిన ప్రక్రియ జరగనున్నందున.. రోజంతా సభల్లో అందుబాటులో ఉండి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరింది. ఈమేరకు సందేశంతో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు బీజేపీ వేర్వేరుగా విప్‌లను జారీ చేసింది. మోడీ సర్కారు పార్లమెంటులో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టేందుకు ఈసారి సెషన్‌ను ఒకరోజు(ఫిబ్రవరి 10 వరకు) పొడిగించారు. గత పదేళ్ల మోడీ సర్కారు పాలన, అంతకుముందు యూపీఏ హయాంలో చోటుచేసుకున్న ఆర్థిక విధ్వంసం, కుంభకోణాల వివరాలతో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్వేతపత్రాన్ని ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.

Advertisement

Next Story