- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసు : పోలీసులకు కోర్టు ఆర్డర్ ఇదే
దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది డిసెంబరు 13న పార్లమెంటులో ఆగంతకులు కలకలం క్రియేట్ చేసిన వ్యవహారంలో దర్యాప్తు మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు తాజా స్థితిపై సోమవారం విచారించిన ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు.. విచారణను కంటిన్యూ చేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు మరో 45 రోజుల గడువును మంజూరు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లో సెక్షన్ల కింద కేసు నమోదైనా విచారణ నత్తనడకన కొనసాగుతుండటం గమనార్హం. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ‘‘ఈ కేసు సున్నితమైనది. కొన్ని నివేదికలు అందాల్సి ఉంది. డిజిటల్ డేటా కూడా భారీగా సేకరించి విశ్లేషించాల్సి ఉంది. ఈ దర్యాప్తును పూర్తి చేసేందుకు మరో 90 రోజుల గడువు ఇవ్వండి’’ అని కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం పాటియాలా హౌస్ కోర్టు విచారించింది. ఈ ఏడాది ఏప్రిల్ 25లోగా విచారణ పూర్తి చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితులందరికీ కోర్టు 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. సోమవారం వారందరినీ కోర్టు ఎదుట హాజరుపరిచారు.