- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Parliamenet: పార్లమెంటులో వాటర్ లీకేజ్..లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొత్త పార్లమెంట్ భవనంలో నీరు లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి నేతలు ఫైర్ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ..బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘పార్లమెంట్ బయట పేపర్ లీక్ అవుతోంది. లోపల నీరు లీక్ అవుతోంది’ అని పేర్కొన్నారు. పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఏడాది కావస్తున్నా పరిస్థితి ఇలాగే ఉందని పేర్కొన్నారు. అలాగే నీటి లీకేజీకి సంబంధించి గురువారం లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్ భవనంపై పైకప్పు నుంచి వర్షపు నీరు లీకవ్వడంపై చర్చించాలని డిమాండ్ చేశారు. భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. లీకేజీకి గల కారణాలపై కమిటీ దృష్టి సారిస్తుందని, అవసరమైన మరమ్మతులను సిఫారసు చేస్తుందని తెలిపారు. ఈ తీర్మానానికి సభ్యులందరూ మద్దతివ్వాలని కోరారు.
పరిస్థితిని చక్కదిద్దాం: లోక్ సభ సెక్రటేరియట్
పార్లమెంట్ హౌస్ పై నుంచి నీళ్లు కారడంపై లోక్‌సభ సెక్రటేరియట్ క్లారిటీ ఇచ్చింది. కొత్త పార్లమెంట్ హౌస్‌లో గోపురం లాంటి గాజును తయారు చేశారని తెలిపింది. ఒక గ్లాసుకు మరొక గ్లాసును కలపడానికి ఉపయోగించే అంటుకునే పదార్థం స్థానంలో నుంచి కొద్దిగా జరగడంతో చిన్నపాటి నీటి లీకేజీ ఏర్పడిందని పేర్కొంది. వెంటనే పరిస్థితి చక్కదిద్దినట్లు వెల్లడించింది.