- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం.. నివాసం వద్ద భారీగా పోలీసులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆదివారం ఇంటి ముందు మోహరించారు. మరోవైపు ఆయన మద్ధతు దారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చారు. ఆయన తన నివాసంలో లేరని పోలీసులు తెలిపారు. అవినీతి ఆరోపణల కేసులో కోర్టు ముందు హజరుకావాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కోర్టు ముందు హజరుకాలేకపోయారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది.
దీంతో ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్ లో ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు దేశం అన్యాయం వైపు ఎప్పుడైతే నిలబడిందో అప్పుడే బానిసగా మారుతుందని ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఉన్నత స్థాయి నేతలే నేరస్థులు అయినప్పుడు దేశంలో ఏం జరగుతుందని ప్రశ్నించారు. ఈ నేతలందరూ దేశం బయటకు డబ్బులను బయటికి తరలించారని విమర్శించారు. దాని కారణంగానే దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. తనను చంపేందుకు కుట్ర జరిగిందని, తనకు సరైన భద్రతా కూడా లేకపోయిందని చెప్పారు.
- Tags
- Imran Khan
- Arrest