Pakisthan: పాక్ దౌత్యవేత్తను వెనక్కి పంపిన అమెరికా.. కారణమిదే?

by vinod kumar |
Pakisthan: పాక్ దౌత్యవేత్తను వెనక్కి పంపిన అమెరికా.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. అన్ని డాక్యుమెంట్లు, వ్యాలిడ్ వీసా ఉన్నప్పటికీ పాక్ దౌత్యవేత్త (Pak envoy) ను అమెరికా వెనక్కి పంపించింది. పాక్ రాయబారిని తమ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి నిరాకరించింది. పాక్ మీడియా కథనాల ప్రకారం.. తుర్క్‌మెనిస్థాన్‌ (Thurkmenisthan)లోని పాక్ రాయబారి కేకే అహ్సాన్ వాగన్ (KK Ahsan Wagan) వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. లాస్ ఎంజిల్స్‌ (Los Angeles)లో ల్యాండైన అనంతరం సరైన పత్రాలు ఉన్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపించినట్టు తెలుస్తోంది. దీనికి గల స్పష్టమైన కారణాలు యూఎస్ అధికారులు వెల్లడించనప్పటికీ అహ్సాన్ వీసా విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన తిరిగి వెనక్కి వచ్చినట్టు సమాచారం. దీనిపై అహ్సాన్ అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఇతర ఉన్నతాధికారులకు అహ్సాన్ వివరణ ఇచ్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై మరింత వివరణకు వాగన్‌ను ఇస్లామాబాద్‌కు రప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని లాస్ ఏంజిల్స్‌లోని పాకిస్తాన్ కాన్సులేట్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ సంఘటనకు రెండు దేశాలకు సంబంధించిన దౌత్య విధానంతో సంబంధం లేదని పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠిన తరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Next Story

Most Viewed