- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Press Club of India: పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా సురేశ్ విజయం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(Press Club of India) ఎన్నికల్లో మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పబ్బ సురేశ్(Pabba Suresh) గెలుపొందారు. ఢిల్లీలోని పీసీఐలో శనివారం ఈ ఎన్నికలకు పోలింగ్ జరగగా... ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్(Gautam Lahiri Panel) విజయం సాధించింది. తెలంగాణ బిడ్డ పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.
కాగా, ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశ వ్యాప్తంగా జర్నలిస్ట్‌ల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు. ఇకపై తెలంగాణ జర్నలిస్ట్‌ల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించిన, ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గౌతమ్ లహిరి ప్యానెల్ ఒకటే పోటీ చేయగా.పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు.