Parlament: లక్షకు పైగా మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్.. పార్లమెంట్ కు వివరించిన కేంద్రం

by Prasad Jukanti |
Parlament: లక్షకు పైగా మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్.. పార్లమెంట్ కు వివరించిన కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గడిచిన 10 సంవత్సరాలలో టెలికాం రంగంలో (Telecom Department) వివిధ సంస్కరణల ద్వారా అనే మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2014 లో వన్ జీబీ డేటా ధర రూ. 269 ఉంటే అది జూన్ 2024 నాటికి వన్ జీబీకి రూ. 8.31 భారీగా తగ్గిందని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) గురువారం తెలిపారు. ఇంటర్నెట్ వినియోగదారులు మార్చి 2014లో 25.15 కోట్ల నుండి ఈ ఏడాది జూన్‌లో 96.9 కోట్లకు పెరిగారని పేర్కొన్నారు. 4.6 లక్షల బేస్ ట్రాన్స్-రిసీవర్ స్టేషన్లు, దేశవ్యాప్తంగా విస్తరించిన బీటీఎస్ తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5G సేవలు భారతదేశంలో అందుతున్నాయని తెలిపారు. అలాగే నకిలీ పత్రాలపై తీసుకున్న అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను గుర్తించేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం ఏఐ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసిందని మిస్టర్ శేఖర్ ప్రత్యేక సమాధానంలో తెలిపారు. అనుమానిత ఫ్రాడ్ కమ్యూనికేషన్‌లు, అయాచిత కమర్షియల్ కమ్యూనికేషన్‌లను నివేదించడానికి పౌరులకు అధికారం కల్పించడానికి DoT సంచార్ సాథి పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పౌరుల ఫిర్యాదులు ఆధారంగా, లక్షకు పైగా మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయని 2809 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు బ్లాక్ చేయబడ్డాయని తెలిపారు. అలాగే 6,261 వాట్సాప్ ఖాతాలు నిలిపివేసినట్లు వివరించారు.

Advertisement

Next Story