- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో 9 కిలోల బంగారం పట్టివేత
దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని ఎయిర్ పోర్టుల్లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో 9 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం 6.29 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి బెంగళూర్ వస్తున్న విమానంలో బంగారం పట్టుబడింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో థాయ్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో పక్కా సమాచారం వేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. హ్యాండ్ బ్యాగులో దాచిన రూ.4.77 కోట్ల 6.8 కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులోని ఐడీ ప్రూఫ్స్ ఆధారంగా ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా.. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అంగీకరించారు.
కెంపెగౌడ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ ఫ్లైట్ లో దాదాపు 2.18కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.1.52 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. లావేటరీలో దాచి దాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.