కర్ణాటకలో 7 వేలకు చేరిన డెంగ్యూ కేసులు.. అత్యధికం బెంగళూరులోనే

by S Gopi |
కర్ణాటకలో 7 వేలకు చేరిన డెంగ్యూ కేసులు.. అత్యధికం బెంగళూరులోనే
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఫలితంగా ఈ ఏడాది నమోదైన కేసుల్లో కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో 7,000 డెంగ్యూ కేసులను నమోదు చేసింది. జూలై 6 నాటికి రాష్ట్రంలో 7,006 మందికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారణ అయింది. వారిలో ఆరుగురు డెంగ్యూ కారణంగా మరణించారు. రాష్ట్ర రాజధాని ఒక్క బెంగళూరులోనే అత్యధికంగా ,1908 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర జిల్లాల వారిగా చూస్తే చిక్కమగళూరులో 521, మైసూర్‌లో 496, హవేరిలో 481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్య సేవలందించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలను కోరారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూ రావు ఎప్పటికప్పుడు పరిస్థితులౌ సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన స్థాయిలో తాగునీరు లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఆర్ అశోక జయానగర్‌లోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించి డెంగ్యూతో బాధపడుతున్న వారికి పరామర్శించారు. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రోడ్లపై చెత్తాచెదారాన్ని తొలగించాలని, దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న చోట్ల ఫాగింగ్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed